BREAKING
thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం
Date of Publish : 02 October 2026, 09:44 pm
Posted by : కూనురు మధు

చెరువుగట్టు ఆలయ కోనేరులోకి మురుగు నీరు.. భక్తుల ఆగ్రహం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
02 Oct, 2026 - 09:44 PM
65 వీక్షణలు

చెరువుగట్టు ఆలయ కోనేరులోకి మురుగు నీరు.. భక్తుల ఆగ్రహం

చెరువుగట్టు: తెలంగాణ శ్రీశైలంగా పేరొందిన చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పుణ్యక్షేత్రంలో పారిశుధ్య నిర్వహణపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం ఎదుట ఉన్న కోనేరులోకి డ్రైనేజీ మురుగు నీరు చేరుతున్నట్లు గుర్తించిన భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

అక్టోబర్ 2 సెలవు దినం కావడంతో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు చెరువుగట్టుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు ఆలయం ఎదుటి కోనేరులో పుణ్యస్నానాలు చేస్తుండగా, డ్రైనేజీ పైపుల ద్వారా మురుగు నీరు కోనేరులోకి చేరుతున్నట్లు గుర్తించారు.

ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో డ్రైనేజీ పైపుల నుంచి మురుగు నీరు కోనేరులోకి ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి పుణ్యక్షేత్రానికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం బాధాకరంగా ఉందని పలువురు పేర్కొన్నారు.

ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రంలో పవిత్ర కోనేరులోకి మురుగు నీరు చేరకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కోనేరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మురుగు నీటి ప్రవాహానికి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.