మంచిర్యాలలో 375 మంది ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాదీఖానా మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన ముస్లిం మహిళలకు 375 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా మహిళలు తమకు అనుకూలమైన ఉపాధి కార్యకలాపాలను చేపట్టే అవకాశం కలుగుతుందని, తద్వారా కుటుంబ ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ సహకారం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం మైనారిటీ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఖలీద్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు కొక్కిరాల సురేఖను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి–నర్సయ్య, మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షుడు పూదరి తిరుపతి, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాహిద్ అలీ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మైనారిటీ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.