శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు దిగ్విజయం: బీఆర్ నాయుడు
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
తిరుమలలో నిర్వహించిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి హుండీ ద్వారా రూ.28.94 కోట్ల ఆదాయం లభించింది.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు 21.84 లక్షల అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కోసం 33 లక్షల లడ్డూలను విక్రయించారు.
టీటీడీ అధికారులు, సిబ్బంది, భద్రతా విభాగాలు, ఇతర శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమిష్టిగా పనిచేశాయని పేర్కొన్నారు.