రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు షర్మిల యత్నం.. నివాసం వద్దే అడ్డుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తన నివాసం నుంచి స్వయంగా కారు నడుపుకుంటూ రాజ్‌భవన్‌కు బయలుదేరిన ఆమెను పోలీసులు బయటకు వెళ్లకుండా నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పోలీసులు తనను అడ్డుకోవడంతో షర్మిల తన నివాసం ఎదుటే నిరసనకు దిగారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతబట్టి ధర్నా చేపట్టారు. రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన తనను అడ్డుకోవడంపై ఆమె నిరసన వ్యక్తం చేశారు. దీంతో విజయవాడలో రాజకీయంగా ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.