BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 01:06 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

నంద్యాల జెడ్పీ చైర్మన్‌గా షేక్ బ్రహానుద్దీన్.. వైస్ చైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
20 Nov, 2026 - 01:06 PM
27 వీక్షణలు

నేడు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.. వీడిన జెడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ

నంద్యాల, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): నంద్యాల జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై చివరి క్షణం వరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. జెడ్పీ చైర్మన్‌గా బనగానపల్లె జెడ్పీటీసీ సభ్యుడు షేక్ బ్రహానుద్దీన్‌ను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. వైస్ చైర్మన్‌గా సిరివెళ్ల జెడ్పీటీసీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డిని ఎంపిక చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

జెడ్పీ చైర్మన్ పదవికి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, చివరకు మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన షేక్ బ్రహానుద్దీన్‌కు అవకాశం కల్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎంపికలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం శుక్రవారం కొలువుదీరనుంది. తొలుత కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు వారి ప్రమాణ స్వీకారం జరగనుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికేలా అధికారులు అవసరమైన సన్నాహాలు చేపట్టారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రకటనతో జిల్లా పరిషత్ నూతన పాలకవర్గ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది.