జనసేన ఒంగోలు పార్లమెంట్ కమిటీలో సింగరాయకొండ నేతలకు చోటు
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఒంగోలు పార్లమెంట్ నిర్వాహక్ దళ్ కమిటీలో సింగరాయకొండకు చెందిన యన్నం రాము, అయినాబత్తిన రాజేష్, కాసుల శ్రీకాంత్‌లకు చోటు దక్కింది.
ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్తల జాబితాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, స్థానిక రాజకీయ పరిస్థితులను అంచనా వేయడం, ప్రజా సమస్యలను గుర్తించడం, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహ అభ్యర్థుల వివరాలను సేకరించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతలుగా ఉన్నాయి.
కమిటీలో సింగరాయకొండకు చెందిన నాయకులకు అవకాశం లభించడంతో స్థానిక జనసేన శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.