చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలు శిక్ష
ఆంధ్రప్రదేశ్
- రూ.10.10 లక్షల జరిమానా విధించిన కందుకూరు కోర్టు
కందుకూరు: చెల్లని చెక్కు కేసులో చుట్టుగుంట గ్రామానికి చెందిన కండ్రా హరిబాబుకు కందుకూరు కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10.10 లక్షల జరిమానా విధిస్తూ సోమవారం (26-10-2026) తుది తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. కందుకూరుకు చెందిన బత్తిన మాల్యాద్రికి 2015లో కండ్రా హరిబాబు రూ.10 లక్షలకు చెక్కు ఇచ్చారు. అయితే ఆ చెక్కు చెల్లకపోవడంతో బాధితుడు బత్తిన మాల్యాద్రి కందుకూరు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించి కేసు దాఖలు చేశారు. సీసీ నంబర్ 535/2015గా నమోదైన ఈ కేసులో విచారణ పూర్తికావడంతో న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. కండ్రా హరిబాబుకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10,10,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.