ప్రశాంతంగా ముగిసిన ఎస్ఎంసీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి పీవీడీఎల్ నరసింహారావు తెలిపారు.
మండలంలోని 50 ప్రాథమిక పాఠశాలలు, 13 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా పూర్తయిందన్నారు.
ఎస్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు, ఇతరులకు మండల విద్యాశాఖ అధికారి పీవీడీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు.