BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 08:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

షర్మిలపై సోషల్ మీడియా ప్రచారం.. వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఖండన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 08:08 PM
25 వీక్షణలు

విజయవాడ: తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను ఎవరినో కలిశానని, ఎక్కడో చేరబోతున్నానని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. తనపై అల్లుతున్నవన్నీ కట్టుకథలేనని, చేస్తున్న విశ్లేషణలకు ఎలాంటి ఆధారం లేదని పేర్కొన్నారు.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాను చివరిసారిగా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనే కలిశానని షర్మిల తెలిపారు. ఇప్పుడు మరోసారి కలిసినా అది తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు.

తన బిడ్డ వివాహానికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించి, నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరడం సహజమేనని అన్నారు. ఇందులో కొత్తదేమీ లేదని, వింత అంతకన్నా కాదని పేర్కొన్నారు. కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకుని తెరవెనుక రాజకీయాలు చేసుకునే ఖర్మ వైఎస్సార్ బిడ్డగా తనకు లేదని స్పష్టం చేశారు.

శుభకార్యానికి, రాజకీయాలకు ముడిపెట్టి తన విశ్వసనీయతను, రాజకీయ ప్రామాణికతను, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి వివాహ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ హాజరై, ఒక్కటి కాబోతున్న నవదంపతులకు హృదయపూర్వక ఆశీస్సులు అందించాలని ఆమె కోరారు.