BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 29 September 2026, 10:32 pm
Posted by : కూనురు మధు

రైతుల భూ సమస్యలకు రీసర్వేతో పరిష్కారం : ఆర్డీవో అశోక్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 Sep, 2026 - 10:32 PM
12 వీక్షణలు

పేరేపల్లిలో ప్రత్యేక గ్రామసభలో రీసర్వే విధానంపై అవగాహన

NTODAY NEWS: చిట్యాల 

రైతుల భూ సమస్యలకు రీ సర్వేతో అవుతుందని నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి  అన్నారు.

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో భూముల రీసర్వేకు సంబంధించి ప్రత్యేక గ్రామసభను మంగళవారం రెవిన్యూ అధికారులు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రూపాని సోనియా  అధ్యక్షతన జరిగిన సమావేశానికి నల్లగొండ ఆర్డీవో అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో అశోక్ రెడ్డి  మాట్లాడుతూ మండలంలోని రెండు గ్రామాల్లో భూముల రీ సర్వే నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైందన్నారు. ఇందులో మొదటి గ్రామమైన పిట్టంపల్లిలో రీసర్వే ప్రక్రియ పూర్తయిందని, రెండో గ్రామమైన పేరేపల్లి  ప్రస్తుతం రీసర్వే కొనసాగుతోందని తెలిపారు. పేరేపల్లి గ్రామ  పరిధిలోని 318 సర్వే నంబర్లలో ఉన్న భూములను సమగ్రంగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. రీ సర్వేలో ముందుగా గ్రామ సరిహద్దులు, గ్రామకంఠం, ప్రభుత్వ భూములు, అనంతరం పట్టా భూములు, రహదారుల సర్వే చేపట్టనున్నట్లు వివరించారు. రైతులు తమ భూముల వద్ద సర్వే సమయంలో స్వయంగా హాజరై హద్దు రాళ్లను చూపించాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి రైతు భూమికి భూధార్ ఎల్ పి ఎం నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు.రీసర్వే ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు గ్రామస్థులు, రైతులు సర్వే బృందానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల తహసిల్దార్ విజయ్ కుమార్, ఆర్ ఐ అమర్నాథ్ రెడ్డి, సర్వేయర్ రజనీకాంత్, జిపిఓ యాదయ్య పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.