BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 06:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాయపట్నంలో ప్రత్యేక వైద్య శిబిరం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 06:27 PM
18 వీక్షణలు

రాయపట్నంలో ప్రత్యేక వైద్య శిబిరం విషజ్వరాలు, అంటువ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం రాయపట్నం గ్రామంలో విషజ్వరాలు, అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బి. పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ శిబిరం నిర్వహించారు. వైద్యులు గ్రామస్తులను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు మందులను పంపిణీ చేశారు. శిబిరానికి ముందు వైద్య సిబ్బంది గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బి. పృథ్వీరాజ్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా విషజ్వరాలు, అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. వరల్డ్ రాబిస్ డే సందర్భంగా కుక్కకాటుకు గురైన వారికి ప్రభుత్వం అందిస్తున్న చికిత్స, వ్యాక్సిన్లపై ప్రజలకు అవగాహన కల్పించారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంతో రానున్న 100 వారాల్లో యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచే లక్ష్యంతో చేపట్టిన ‘నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా యువతతో ప్రతిజ్ఞ చేయించి, సంతకాల సేకరణ చేపట్టారు.

గ్రామపంచాయతీ సర్పంచ్ కంచం గోపి అధ్యక్షతన జరిగిన వైద్య శిబిరంలో పంచాయతీ కార్యదర్శి నరేష్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ మార్నీడి పుల్లారావు మాట్లాడుతూ గ్రామంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు అందిస్తున్న వైద్య సేవలను అభినందించారు. గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలపై వేగంగా స్పందించి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ బి. పృథ్వీరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సర్పంచ్ కంచం గోపి మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య పరిరక్షణకు, ప్రజల ఆరోగ్య సంరక్షణకు సర్పంచ్‌గా ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన వైద్యాధికారి డాక్టర్ బి. పృథ్వీరాజ్‌తో పాటు వైద్య సిబ్బందికి, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యుడు కోట రాజా, మాజీ సభ్యుడు ఎడ్ల సాంబయ్య, హెల్త్ సూపర్‌వైజర్ కె. వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఎం విజయకుమారి, ఆశా కార్యకర్తలు విజయ, ప్రభావతి, విజయకుమారి, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.