బాల్య వివాహాలకు దూరంగా ఉండాలి : చైర్‌పర్సన్ పందిరి గీత
సమాజ బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని , బాల్యవివాహాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ అన్నారు. మంగళవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల వద్ద గల మొదటి అంగన్ వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాస కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు అందించే ఆహార పదార్థాలను నిత్య ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, మొలకెత్తిన గింజలు, పల్లీలు తదితర పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు, ముఖ్యంగా కిషోర బాలికలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండాలి
మిషన్ వాత్సల్య కార్యక్రమం ద్వారా 18 సంవత్సరాల లోపు బాలలకు రక్షణ, సహాయం అందించేందుకు 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉందని గీత రమేష్ తెలిపారు. బాలలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1098కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని, బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేశపాక లతా రాజేష్, గాలి యాదమ్మ, లింగయ్య, కో-ఆప్షన్ సభ్యులు సాహెద్ ఇబ్రహీం, బెల్లి సత్తయ్య, జడ్పీహెచ్‌ఎస్ హెడ్మాస్టర్ సుశీల, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ సతీష్, బాలల హక్కుల పరిరక్షణ ప్రతినిధి రాము, అంగన్‌వాడీ టీచర్లు దాడి అరుణ, అపర్ణ, బుజ్జమ్మ, కృష్ణవేణి, జ్యోతి, శోభారాణి, వరమ్మ, అరుణ, ఇందిరా, లలిత, అంజమ్మ, సరిత, సునీత, నాగమణి, అలివేలుమంగ తదితరులు పాల్గొన్నారు. తల్లులు, కిషోర బాలికలు కార్యక్రమానికి హాజరయ్యారు.