BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 09:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Oct, 2026 - 09:53 PM
43 వీక్షణలు
  • టి.గుడిపాడుకు చెందిన వ్యక్తిని జైలుకు తరలించిన చాట్రాయి పోలీసులు 

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం టి.గుడిపాడు గ్రామానికి చెందిన పామర్తి శైలేంద్ర అలియాస్ శైలేంద్రరావు (29) బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించడంతో అధికారులు జైలుకు తరలించారు. గతంలో గొడవలకు సంబంధించి బైండోవర్ చేసినప్పటికీ మరో కేసులో నిందితుడిగా ఉండటంతో చాట్రాయి పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఈ చర్యలు గుణపాఠమని నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్రకుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు సబ్‌డివిజన్ డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ పర్యవేక్షణలో, నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్రకుమార్ సూచనలతో చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. టి.గుడిపాడు గ్రామానికి చెందిన పామర్తి శైలేంద్ర అలియాస్ శైలేంద్రరావును గతంలో గొడవలకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధించేందుకు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 129(ఈ) ప్రకారం ఎం.సి. నంబర్ 184/2026 ద్వారా 12 నెలల పాటు బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల స్వీయ భద్రతా బాండ్ అమలు చేశారు. అయితే, పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా సదరు వ్యక్తి 2026 సెప్టెంబర్ 5న చాట్రాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 109/2026, బీఎన్‌ఎస్ సెక్షన్లు 78(2), 329(4), 351(2) కింద నమోదైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో బైండోవర్ నిబంధనల ఉల్లంఘనపై చాట్రాయి పోలీసులు సంబంధిత మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్, తహసీల్దార్‌కు నివేదించారు. ఈ నేపథ్యంలో అధికారులు బాండ్ ఉల్లంఘనపై నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. సదరు వ్యక్తి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో పాటు బాండ్‌కు సంబంధించిన ష్యూరిటీ మొత్తాన్ని చెల్లించలేనని తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్, తహసీల్దార్ జి. శ్వేత డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. బైండోవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు బైండోవర్‌లో ఉన్న వ్యక్తులు మళ్లీ నేరాలకు పాల్పడినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్రకుమార్ హెచ్చరించారు. బాండ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం జరిమానాలు, నిర్బంధ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాశాంతి, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.