BREAKING
thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ
Date of Publish : 06 October 2026, 06:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 06:10 PM
6 వీక్షణలు

తిరువూరు: పట్టణంలోని ఎరువుల దుకాణాలను వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం. శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల విక్రయాలు, నిల్వలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎరువుల స్టాక్ రిజిస్టర్లు, 13 స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డులు, సోర్స్ సర్టిఫికెట్లను తనిఖీ చేశారు. అలాగే బయో స్టిములెంట్స్‌కు సంబంధించిన నిల్వలు, వాటి సోర్స్ సర్టిఫికెట్లను పరిశీలించారు. దుకాణాల్లో ఉన్న ఎరువుల నిల్వలు, రికార్డుల్లో నమోదైన వివరాలతో సరిపోతున్నాయా లేదా అనే అంశాలను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎరువుల డీలర్లకు అధికారులు పలు సూచనలు చేశారు. ఎరువులు విక్రయించే ప్రతి డీలర్ తాము విక్రయించే ఎరువులకు సంబంధించిన సోర్స్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తమ ఎరువుల లైసెన్సులో చేర్చుకోవాలని సూచించారు. సరైన సోర్స్ సర్టిఫికెట్, ఇన్వాయిస్ లేకుండా ఎరువుల విక్రయాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

తనిఖీల్లో సోర్స్ సర్టిఫికెట్, ఇన్వాయిస్ లేకుండా ఎరువుల విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే సంబంధిత డీలర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత ఎరువుల విక్రయాలపై స్టాప్ సేల్ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.ఈ తనిఖీల్లో ఏవో పద్మ పాల్గొన్నారు.