టీజీ-ఐపాస్ కమిటీ సమావేశం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
పారిశ్రామిక అనుమతులు, ప్రోత్సాహకాలపై సమీక్ష
హనుమకొండ | Ntoday News
హనుమకొండ కుడా కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (DIPC), టీజీ-ఐపాస్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
సమావేశంలో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు, ప్రోత్సాహకాలు, వివిధ దరఖాస్తుల పురోగతిపై అధికారులు సమీక్షించారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమైన అనుమతులను సకాలంలో అందించడంతో పాటు, పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించడంపై చర్చించారు.
జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.