నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం
నంద్యాల: మహాలయ అమావాస్య సందర్భంగా నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు నల్ల నువ్వులతో తర్పణం వదిలే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం వెంకట సుబ్బయ్య శెట్టి–వెంకమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జరగనుంది.
రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యదర్శి నాగరడోను సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు నంద్యాలలోని చిన్న చెరువు కట్ట వద్ద తర్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పితృదేవతలకు తర్పణం సమర్పించాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి హాజరయ్యే వారు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనాలని సూచించారు.
కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 950551526 నంబర్‌ను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.