BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 04:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైసీపీ కంచుకోటలో టీడీపీ జెండా.. బూరుగుగూడెంలో బూబత్తుల నాగ స్వరూప చారిత్రాత్మక విజయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Nov, 2026 - 04:40 PM
212 వీక్షణలు

15 ఓట్ల ఆధిక్యంతో అనూహ్య విజయం.. బూరుగుగూడెం రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని వైసీపీకి పట్టున్న గ్రామంగా పేరొందిన బూరుగుగూడెంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బూబత్తుల నాగ స్వరూప విజయం సాధించి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇప్పటివరకు వైసీపీకి బలమైన పట్టున్న గ్రామంగా గుర్తింపు పొందిన బూరుగుగూడెంలో ఈసారి ఓటర్లు తమ తీర్పుతో కొత్త రాజకీయ పరిణామానికి తెరలేపారు. శనివారం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపులో బూబత్తుల నాగ స్వరూప తన ప్రత్యర్థిపై 15 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గ్రామ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విజయానికి సూరిబాబు మాస్టారు చేసిన కృషి, మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన హామీలు కూడా కీలకంగా నిలిచాయని స్థానిక టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. బూరుగుగూడెం, పర్వతాపురం ప్రాంతాల అభివృద్ధి, భవిష్యత్తుపై ఓటర్లు ఆశలు పెట్టుకుని తమ తీర్పును వెల్లడించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఒక పార్టీకి అనుకూలంగా సాగిన రాజకీయ సమీకరణాలకు భిన్నంగా వెలువడిన ఈ ఫలితం చాట్రాయి మండల రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది.బూబత్తుల నాగ స్వరూప విజయంతో బూరుగుగూడెం రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.