BREAKING
thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు
Test 4
Date of Publish : 16 November 2026, 03:11 pm
Posted by : PAGADALA DEVAIAH

తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
16 Nov, 2026 - 03:11 PM
39 వీక్షణలు

ఉద్యమ జర్నలిస్టుల పేరుతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంపై అభ్యంతరం.. త్యాగాలు మావి.. భోగాలు మీవా అంటూ ప్రశ్నలు

ఎల్బీనగర్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని, తమ కలం, గళం, కార్యాచరణతో ఉద్యమానికి మద్దతుగా నిలిచిన జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఉద్యమ జర్నలిస్టులు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తులు ఉద్యమ జర్నలిస్టుల పేరుతో ఆత్మీయ సమ్మేళనాలు, సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తాము రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీల్లో పాల్గొన్నామని, 'జై తెలంగాణ' నినాదాలతో ఉద్యమానికి అండగా నిలిచామని పేర్కొన్నారు. ఆ సమయంలో ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు అనేక ఇబ్బందులు, అవమానాలు, ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ ఉద్యమంలో భాగస్వాములయ్యారని గుర్తుచేశారు.

అలాంటి ఉద్యమ చరిత్రతో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి, తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల పేరుతో సన్మానాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యమ జర్నలిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు జరిగినా సహించబోమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులను పలు ప్రశ్నలు సంధించారు. కరోనా సమయంలో ఎంతమంది జర్నలిస్టులకు సహాయం అందించారు? జర్నలిస్టులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఎంతమేర ఆర్థిక సాయం చేశారు? కష్టకాలంలో ఉన్న జర్నలిస్టులకు ఎలాంటి అండగా నిలిచారు? నిజమైన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు కల్పించారు? ప్రమాదాల్లో గాయపడిన జర్నలిస్టులకు, మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు ఏ విధమైన న్యాయం చేశారు? అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఉద్యమ చరిత్రను వ్యక్తిగత లేదా స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. ఉద్యమ జర్నలిస్టుల పేరుతో నిర్వహించాలనుకుంటున్న ఆత్మీయ సమ్మేళనాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

యూనియన్ పరిధిలో తమకు నచ్చిన కార్యక్రమాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల పేరుతో నిజమైన ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమైతే మరోసారి ఉద్యమ బాట పట్టడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.

తెలంగాణ కోసం గతంలో ఎన్నో ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలు నిర్వహించిన అనుభవం తమకు ఉందని పేర్కొంటూ, పరిస్థితులు ఉద్రిక్తతలకు దారితీయకముందే నిర్వాహకులు పునరాలోచన చేయాలని సూచించారు. నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలని, వారి త్యాగాలను గౌరవించాలని, ఉద్యమ చరిత్రను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవద్దని కోరారు.

తెలంగాణ ఉద్యమం ఎవరి సొంత ఆస్తి కాదని, వేలాది మంది త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. ఆ ఉద్యమంలో భాగస్వాములైన జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.