BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 05:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర నూతన బస్టాండ్ పనులను పరిశీలించిన టీజీఎస్‌ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Sep, 2026 - 05:34 PM
13 వీక్షణలు

మధిర నూతన బస్టాండ్ పనులను పరిశీలించిన టీజీఎస్‌ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో నిర్మాణంలో ఉన్న నూతన బస్టాండ్ పనులను టీజీఎస్‌ఆర్టీసీ కరీంనగర్ జోన్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలమన్ శుక్రవారం పరిశీలించారు. ఆయనతో పాటు ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ. సరిరామ్, డిప్యూటీ ఆర్‌ఎం ఏ. రాజేశ్వర్ రెడ్డి నూతన బస్టాండ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, చేపట్టాల్సిన తదుపరి పనులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధిర ఆర్టీసీ డిపోను సందర్శించిన పి. సోలమన్ డిపోలోని ఆదాయం, వ్యయాల వివరాలను పరిశీలించారు. డిపో పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదాయం పెంపు, ఖర్చుల నియంత్రణ, సంస్థకు మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. డిపో నిర్వహణ, బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, ఆదాయాన్ని పెంచే అవకాశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ టీ. దేవరాజు, అధికారులు, సిబ్బంది డిపోలోని పరిస్థితులు, సమస్యలు, అవసరాలను జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.