BREAKING
thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
Date of Publish : 04 July 2026, 12:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 వేల పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 12:45 PM
134 వీక్షణలు

హైదరాబాద్, జూలై 4: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలీసుశాఖలో 5 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన అనుమతులను రాష్ట్ర ఆర్థికశాఖ మంజూరు చేసింది.

భర్తీ చేయనున్న పోస్టుల్లో అత్యధికంగా కానిస్టేబుల్ (సివిల్) విభాగంలో 3,697 పోస్టులు, కానిస్టేబుల్ (ఏఆర్)లో 1,052 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్‌ఐ (సివిల్) 148, ఎస్‌ఐ (ఆర్మ్డ్ రిజర్వ్) 14, ఆర్‌ఎస్‌ఐ (టీజీఎస్‌పీఎస్సీ) 12, ఎస్‌ఐ (ఏఆర్ సివిల్) 3, ఏఎస్‌ఐ (ఎఫ్‌పీబీ) 23, కానిస్టేబుల్ (ఎస్‌ఏఆర్ సీపీఎల్) 24, కానిస్టేబుల్ (డ్రైవర్-పీటీవో) 20, మెకానిక్ పీటీవో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ నియామకాల ప్రక్రియను నిర్వహించేందుకు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి.