BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 30 June 2026, 08:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ పోలీసుల వినూత్న చర్య.. విధులకు ముందు కానిస్టేబుళ్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:02 PM
164 వీక్షణలు

 తెలంగాణలో రాత్రి పెట్రోలింగ్ డ్యూటీకి వెళ్లే ముందు పోలీస్ కానిస్టేబుళ్లకు స్టేషన్ ఎస్ఐ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విధుల్లో ఉన్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యత, పారదర్శకత పాటించాలని పోలీస్ శాఖ ఇస్తున్న స్పష్టమైన సందేశంగా ఈ చర్యను పలువురు అభినందిస్తున్నారు.

ప్రజలకు చట్టాలను అమలు చేసే పోలీసులే ముందుగా వాటిని పాటిస్తూ ఆదర్శంగా నిలవాలని, విధుల్లో మద్యం సేవించి ఉండరాదనే అంశంపై పోలీస్ శాఖ తీసుకున్న ఈ చర్యకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల బాధ్యతను గుర్తు చేస్తూ ఈ వీడియో ప్రస్తుతం విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.