BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 11 August 2026, 09:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో ఈనెల 17 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 09:12 PM
81 వీక్షణలు

తెలంగాణలో ఈనెల 17 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు

విద్యా ప్రమాణాలు, వసతులపై ప్రత్యేక దృష్టి.. 307 అకడమిక్‌ బృందాల ఏర్పాటు

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులపై తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించనుంది. ఇందుకోసం 307 అకడమిక్‌ ప్యానెల్‌ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు.

ఈ తనిఖీల్లో పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న బోధనా విధానం, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు శాతం, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందా? బోధనా కార్యక్రమాలు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయా? అనే అంశాలపై కూడా బృందాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నాయి.

తనిఖీల సందర్భంగా గుర్తించిన లోపాలు, పాఠశాలల పరిస్థితి, విద్యార్థుల అవసరాలు తదితర అంశాలతో సమగ్ర నివేదికలను సంబంధిత అధికారులకు సమర్పించనున్నారు. ఈ నివేదికల ఆధారంగా పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, వసతుల మెరుగుదలకు ఈ తనిఖీలు దోహదపడతాయని విద్యాశాఖ భావిస్తోంది.