BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 28 July 2026, 03:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 03:10 PM
61 వీక్షణలు

హైదరాబాద్, జులై 28: తెలంగాణలో ప్రతి కుటుంబానికి అధికారిక కుటుంబ వివరాలను ఒకే చోట అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ రిజిస్టర్ రూపొందించాలని నిర్ణయించింది. రేషన్ కార్డుల డేటా ఆధారంగా ఈ రిజిస్టర్‌ను సిద్ధం చేయనుంది. అలాగే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించింది.

ఈ సర్టిఫికెట్లను మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

సమాజంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన అధికారిక వివరాలను ఒకే పత్రంలో నమోదు చేసి, అవసరమైన సందర్భాల్లో సులభంగా వినియోగించుకునే విధంగా ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.