www.ntodaynews.com
తెలంగాణలో ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రారంభం
తెలంగాణ
తెలంగాణలో ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సర్టిఫికెట్లను ఎమ్మార్వో కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా పొందవచ్చని వెల్లడించారు.
కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, కుటుంబ సమాచారంతో ఈ సర్టిఫికెట్ జారీ చేయబడుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అవసరమైన సేవల్లో ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు.
అయితే, ఈ సర్టిఫికెట్‌ను ఏయే ప్రభుత్వ పథకాలు, సేవలు, అధికారిక లావాదేవీలలో వినియోగించవచ్చనే అంశంపై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది.