BREAKING
thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Date of Publish : 13 August 2026, 03:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 03:19 PM
116 వీక్షణలు

విస్సన్నపేట: ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

విస్సన్నపేటలో పంపిణీ చేసిన వైఎస్సార్ కాలనీ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, ఇళ్లు లేని అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. బుడగజంగాలను ఎస్సీలుగా గుర్తించి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు.

కలగర పంచాయతీ పరిధిలోని ములగలపాటివారిగూడెంలో ఎస్సీలకు శ్మశానవాటిక కోసం భూమి కేటాయించాలని, కొర్లమండ గ్రామంలో పంపిణీ చేసిన సీలింగ్ మిగులు భూమి లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. తెల్లదేవపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీలు సాగు చేస్తున్న భూములకు ఉన్న రెడ్‌మార్క్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 200 రోజులకు పెంచి రోజువారీ వేతనం రూ.600కు పెంచాలని, మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అన్ని పథక కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.36 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డి.హరినాథ్, డి.పుల్లారావు, భరోత్ పీక్ల నాయక్, పి.గోవిందు, భూతం మారయ్య, వేముల బక్కయ్య, పరికెల కళావతి, మేకల కుమారి, భవాని, జి.మారేశ్వరరావు, కే.సత్యనారాయణ, చాట్ల బాబురావు, కలపాల వెంకటేశ్వరరావు, టి.జమలయ్య తదితరులు పాల్గొన్నారు.