BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 26 September 2026, 07:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు కుమ్మరి బజార్‌లో లడ్డూ వేలం రికార్డు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Sep, 2026 - 07:11 PM
57 వీక్షణలు

తిరువూరు పట్టణంలోని కుమ్మరి బజార్‌లో నిర్వహించిన వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తి భావంతో పోటాపోటీగా సాగిన వేలంలో శీరాం సాయి కృష్ణ రూ.1,50,116లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ మొత్తం తిరువూరు చరిత్రలోనే అత్యధికంగా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏటా వినాయక నవరాత్రుల సందర్భంగా కుమ్మరి బజార్‌లో నిర్వహించే లడ్డూ వేలానికి భక్తుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఈ ఏడాది కూడా పలువురు భక్తులు ఉత్సాహంగా పాల్గొని పోటీపడి ధరను పెంచారు. చివరకు శీరాం సాయి కృష్ణ అత్యధికంగా రూ.1,50,116 ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు.

వినాయకుడిపై తనకున్న భక్తిని చాటుకుంటూ సాయి కృష్ణ భారీ మొత్తానికి లడ్డూను వేలంలో దక్కించుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా స్థానికులు, భక్తులు ఆయనను అభినందించారు. వినాయకుడి కృపతో ఆయన కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పెద్దలు ఆకాంక్షించారు.

కుమ్మరి బజార్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లడ్డూ వేలం ఇంతటి భారీ మొత్తానికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. భక్తుల భాగస్వామ్యంతో ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది లడ్డూ వేలం తిరువూరు వినాయక ఉత్సవాల్లో ప్రత్యేక ఘట్టంగా నిలిచిందని పేర్కొన్నారు.