తిరువూరులో పద్య, సూక్తుల పోటీల విజేతలకు బహుమతులు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు: శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తిరువూరు పట్టణంలోని తొమ్మిది పాఠశాలల్లో ఇటీవల నిర్వహించిన పద్య, సూక్తుల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు గురువారం బహుమతులు అందజేశారు.
ప్రతి పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు డివిజనల్ ఉప విద్యాధికారి శ్యామ్ సుందరరావు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో తెలుగు పద్యాలు, సూక్తులపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ దామెర ప్రభాకర్ రావు, పలువురు ఉపాధ్యాయులు, సత్యసాయి సేవా కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.