BREAKING
thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Date of Publish : 03 September 2026, 09:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో స్త్రీ శక్తి భవనం వద్ద నీటి వృథా నెలలుగా పైపు లీకేజీ..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 09:51 PM
53 వీక్షణలు

తిరువూరులో స్త్రీ శక్తి భవనం వద్ద నీటి వృథా నెలలుగా పైపు లీకేజీ.. పట్టించుకోని అధికారులు

అపరిశుభ్రంగా మారిన పరిసరాలు.. చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల డిమాండ్

తిరువూరు, సెప్టెంబర్ 3: తిరువూరు పట్టణంలోని మండల మహిళా సమాఖ్యకు చెందిన స్త్రీ శక్తి భవనం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన నీటి ట్యాంక్ పైపు పగిలిపోవడంతో నెలల తరబడి నీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వెలుగు డీఆర్డీఏ ఆధ్వర్యంలో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాలకు వేదికగా ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం భవనం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ట్యాంక్ పైపు పగిలి నిరంతరం నీరు లీకవుతుండటంతో భవనం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం తడిగా మారుతోంది. నీరు నిలిచిపోవడంతో గోడలకు నాచు పట్టడంతో పాటు దోమలు వృద్ధి చెందే పరిస్థితి నెలకొంది. మరోవైపు భవనం పరిసరాల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో భవనాన్ని వినియోగించే మహిళలు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒకవైపు నీటి సంరక్షణ, నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని భవనం వద్దే నెలల తరబడి నీరు వృథాగా పోతున్నా అడ్డుకోకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాల నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పగిలిన పైపును వెంటనే మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలని, భవనం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారంలో మరింత జాప్యం జరిగితే నీటి వృథాతో పాటు భవనం పరిసరాల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.