BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 09:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తమ్మిలేరు రిజర్వాయర్‌కు వరద తాకిడి.. ఆయకట్టు రైతుల్లో ఆనందం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Sep, 2026 - 09:41 AM
117 వీక్షణలు

చాట్రాయి: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో బేతుపల్లి చెరువు అలుగు నుంచి వరద నీరు విడుదలవుతుండటంతో తమ్మిలేరు రిజర్వాయర్‌కు వరద తాకిడి ప్రారంభమైంది. బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట–శివాపురం గ్రామాల మధ్య కాజ్‌వే వద్ద వరద ప్రవాహం కనిపిస్తోంది.

శుక్రవారం ఉదయం నుంచి తమ్మిలేరులోకి వరద నీరు చేరుతుండటంతో తమ్మిలేరు ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ్మిలేరు రిజర్వాయర్‌కు ప్రస్తుతం సుమారు 1,200 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ లాజర్‌బాబు తెలిపారు. రిజర్వాయర్‌లో ఇంకా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందని, వరద ప్రవాహం మరింత పెరిగితే అవసరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు.

చిన్నంపేట–శివాపురం గ్రామాల మధ్య కాజ్‌వే వద్ద పెరుగుతున్న వరద ఉధృతిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ్మిలేరు ప్రాజెక్టు వద్దకు కూడా ఆయకట్టు రైతులు చేరుకుని వరద నీటిని పరిశీలించారు.

తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో తమ్మిలేరుకు వరద నీరు చేరడం పట్ల రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సాధారణంగా నీటి లభ్యతపై ఆధారపడే ఆయకట్టు ప్రాంతాలకు రిజర్వాయర్‌లోకి వరద నీరు చేరడం ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.

అయితే శుక్రవారం వర్షం తగ్గుముఖం పట్టడంతో తమ్మిలేరుకు వచ్చే వరద ప్రవాహం కూడా పెద్దగా పెరగకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వరద పరిస్థితిపై ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు.