BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 09:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తొట్టంబేడు: లంచం డిమాండ్ ఆరోపణలపై డిప్యూటీ తహసిల్దార్ జీవన్ కుమార్ సస్పెండ్

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 09:57 PM
59 వీక్షణలు

తొట్టంబేడు: లంచం డిమాండ్ ఆరోపణలపై డిప్యూటీ తహసిల్దార్ జీవన్ కుమార్ సస్పెండ్

రూ.3 లక్షల అక్రమ లంచం డిమాండ్ఆరోపణలు.. ఆడియో రికార్డింగ్‌పై విచారణ

శాఖాపరమైన చర్యలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్‌గా పనిచేస్తున్న జీవన్ కుమార్‌పై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సస్పెన్షన్ వేటు వేశారు.

0.09 సెంట్ల భూమికి సంబంధించిన వ్యవహారంలో రూ.3 లక్షల అక్రమ లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు, అలాగే శెట్టిపల్లి భూముల విషయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌పై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేసినట్లు పేర్కొంటున్న ఆడియో రికార్డింగ్ సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంపై శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఆడియో రికార్డింగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో వినిపించిన స్వరం తొట్టంబేడు డిప్యూటీ తహసిల్దార్ జీవన్ కుమార్‌దిగా గుర్తించినట్లు నివేదికలో వెల్లడించారు.

విచారణ అనంతరం అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జీవన్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం మూడు అభియోగాలను నమోదు చేసి, తదుపరి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రెవెన్యూ శాఖలో అవినీతి, నిబంధనల ఉల్లంఘనలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.