BREAKING
thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి
Date of Publish : 05 October 2026, 10:40 pm
Posted by : SEETHA KIRAN KUMAR

విమానంలో వైద్యులే దేవుళ్లయ్యారు..

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Oct, 2026 - 10:40 PM
8 వీక్షణలు

విమానంలో ప్రయాణికుడి ఆక్సిజన్ స్థాయి 40 శాతానికి పడిపోవడంతో కలకలం

ఐజ్వాల్: విమాన ప్రయాణంలో ఓ ప్రయాణికుడి ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా 40 శాతానికి పడిపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. పరిస్థితిని గుర్తించిన ముగ్గురు వైద్యులు వెంటనే స్పందించి ప్రాథమిక వైద్య సహాయం అందించారు.

ప్రయాణికుడి పరిస్థితిని గమనించిన వైద్యులు వెంటనే ఆక్సిజన్ అందించడంతో పాటు అవసరమైన స్టెరాయిడ్లను ఇచ్చినట్లు సమాచారం. సమయస్ఫూర్తితో వైద్య సహాయం అందించడంతో ప్రయాణికుడి పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగినట్లు తెలుస్తోంది.

విమానం ఐజ్వాల్‌లో ల్యాండ్ అయ్యే సమయానికి అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్‌ను ముందుగానే సిద్ధంగా ఉంచారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

విమానంలో అత్యవసర పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించిన ముగ్గురు వైద్యుల చర్యలతో ప్రయాణికుడికి సకాలంలో వైద్య సహాయం అందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.