BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పంజాబ్‌లో ట్రక్కు డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 07:28 PM
25 వీక్షణలు

రాత్రికి రాత్రే మారిన అదృష్టం పంజాబ్ రాష్ట్రంలో ఓ సాధారణ ట్రక్కు డ్రైవర్‌ను అదృష్టం వరించింది. మొహాలీ జిల్లా హమ్యున్‌పూర్ గ్రామానికి చెందిన బల్జీందర్ సింగ్‌కు ఏకంగా రూ.12 కోట్ల లాటరీ తగిలింది. గత 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న ఆయనకు ఎట్టకేలకు భారీ బహుమతి దక్కింది. దీపావళి సందర్భంగా రూ.500 వెచ్చించి పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్-2026 లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. నవంబర్ 16న నిర్వహించిన లాటరీ డ్రాలో ఆయన టికెట్‌కు మొదటి బహుమతి లభించింది. దీంతో రూ.12 కోట్ల విజేతగా నిలిచారు. మంగళవారం ఆయన అధికారికంగా బహుమతి మొత్తాన్ని క్లెయిమ్ చేసుకున్నారు. ఇన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నా ఇంతటి భారీ బహుమతి వస్తుందని ఊహించలేదని బల్జీందర్ సింగ్ ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం. లాటరీ ద్వారా వచ్చిన నగదుతో తన పిల్లల ఉన్నత చదువులకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. సాధారణ జీవితం గడుపుతున్న ఓ ట్రక్కు డ్రైవర్‌కు ఒక్క టికెట్‌తో కోట్లాది రూపాయల బహుమతి రావడంతో హమ్యున్‌పూర్ గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.