BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పాము కాటు వేస్తే నిర్లక్ష్యం వద్దు సకాలంలో వైద్యం అందితే ప్రాణాలకు రక్షణ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:48 PM
26 వీక్షణలు

ప్రజల్లో అవగాహన పెంచుకోవాలి పాము కాటు బాధితులకు యాంటీ స్నేక్ వెనం కీలకం

పాము కాటు ఘటనలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ పొలాలు, పంట చేలు, తోటల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు పాము కాటు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పాము కాటు వేసినప్పుడు భయాందోళనలకు గురై విలువైన సమయాన్ని వృథా చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందడం అత్యంత ముఖ్యం. సరైన సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. విషపూరిత పాము కాటు బాధితులకు వైద్యుల సూచన మేరకు యాంటీ స్నేక్ వెనం (ఏఎస్వీ) చికిత్స అందిస్తారు. ఈ మందును ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఇవ్వాలి. పాము కాటు వేసిన వెంటనే బాధితుడిని ప్రశాంతంగా ఉంచి, కరిచిన అవయవాన్ని వీలైనంత కదలకుండా చూసుకోవాలి. ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి. అవసరమైతే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి అత్యవసర వైద్య సహాయం పొందాలి. పాము కరిచిన ప్రాంతంలో కోయడం, విషాన్ని నోటితో పీల్చడం, గట్టిగా తాడు కట్టడం, పసర్లు వేయడం, నాటు వైద్యం చేయించడం వంటి పద్ధతులకు దూరంగా ఉండాలి. ఇవి బాధితుడి ప్రాణాలకు మరింత ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. పాము కరిచిన తర్వాత లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు పొలాల్లో పనిచేసేటప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు ధరించాలి. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేటప్పుడు టార్చ్‌లైట్ ఉపయోగించాలి. ఇళ్ల పరిసరాల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, పొదలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కట్టెలు, గడ్డి కుప్పలు, రాళ్ల మధ్య చేతులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. పాము కనిపించినప్పుడు దానిని పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించకుండా సురక్షిత దూరంలో ఉండాలి. పాము కాటు అనేది మూఢనమ్మకాలకు, నాటు వైద్యానికి సంబంధించిన విషయం కాదు.. ఇది తక్షణ వైద్య చికిత్స అవసరమైన అత్యవసర పరిస్థితి. 108 అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకుని బాధితులను త్వరగా ఆసుపత్రికి చేర్చాలి. ప్రజల్లో పాము కాటుపై అవగాహన పెంచడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు, రైతులకు తెలియజేయాలి. మనం పంచుకునే ఒక్క అవగాహన సందేశం మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చు. పాము కాటు పట్ల అప్రమత్తంగా ఉండండి.. భయపడకుండా సకాలంలో వైద్యం పొందండి.. ప్రాణాలను కాపాడుకోండి.