కనిగిరి 32వ వార్డులో సైడ్ కాలువలు, కల్వర్టుల నిర్మాణ పనులు ప్రారంభం
కనిగిరి: మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు దొరువు వద్ద ప్రజల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా సైడ్ కాలువలు, కల్వర్టులు, మ్యాన్‌హోల్ నిర్మాణ పనులను చేపట్టారు.
కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. సైడ్ కాలువలు, కల్వర్టులు, మ్యాన్‌హోల్ నిర్మాణంతో వర్షపు నీరు, మురుగు నీటి సమస్యలు తగ్గడంతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్థానికులు కోరారు. పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు రాకపోకల విషయంలో మరింత సౌకర్యం కలగనుంది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.