మీకోసం కార్యక్రమానికి 100 ఫిర్యాదులు
ఒంగోలు: ఒంగోలు పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై మొత్తం 100 ఫిర్యాదులు అందించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుల వివరాలను అడిగి తెలుసుకుని, సంబంధిత అంశాలపై బాధితులకు అవసరమైన సూచనలు చేశారు.
అనంతరం అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, వాస్తవ పరిస్థితులను తెలుసుకుని నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆదేశించారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో స్పందించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.