BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 01:49 pm
Posted by : PAGADALA DEVAIAH

18 ఎకరాల భూమి వివాదాన్ని పరిష్కరించి దళిత రైతులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
11 Nov, 2026 - 01:49 PM
77 వీక్షణలు

ఎల్బీనగర్: హయత్‌నగర్ మండల పరిధిలోని సర్వే నంబర్ 255/1లో ఉన్న 18 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించి, బాధిత దళిత రైతులకు న్యాయం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కోరారు. సుమారు 70 సంవత్సరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులు ప్రస్తుతం భూమి హక్కులకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వం తమ భూములను తీసుకుందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూములకు సంబంధించిన వివాదం, రైతుల హక్కులు, ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలికితీయడంతో పాటు, అర్హులైన బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాధిత రైతులకు ఎకరానికి 500 గజాల చొప్పున స్థలం కేటాయించేలా నిర్ణయం తీసుకుని, ఇందుకు సంబంధించి సంతకాల సేకరణ కూడా చేపట్టిందని సుధీర్ రెడ్డి తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 300 గజాల స్థలం ఇచ్చేలా ప్రతిపాదించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భూములు కోల్పోతున్న బాధిత రైతులకు నష్టపరిహారంగా ఒక్కొక్కరికి 600 గజాల స్థలం కేటాయించాలని కోరారు.

శ్రీ వెంకటేశ్వర కాలనీ నివాసితులకు పట్టాలు ఇవ్వాలి

సాహెబ్‌నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర కాలనీ వీకర్ సెక్షన్‌కు సంబంధించి సర్వే నంబర్ 71/1లో ఉన్న భూముల సమస్యను కూడా ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 58, 59 జీవోల కింద పలువురు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో సుమారు 23 మంది 59 జీవో కింద ఒక్కొక్కరు రూ.1.55 లక్షల చొప్పున చెల్లింపులు కూడా చేశారని పేర్కొన్నారు.

ఈ దరఖాస్తులకు సంబంధించి రెవెన్యూ అధికారులు పరిశీలన నిర్వహించారని, లబ్ధిదారుల జాబితా కూడా సిద్ధమైందని తెలిపారు. కాలనీలో పేద, మధ్యతరగతి కుటుంబాలు సుమారు 80 గజాల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయని వివరించారు. అయితే వారికి పట్టాలు జారీ చేసే ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన నివాసితులకు పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో రైతులు కటేపాక స్కైలాబ్, గంగాని నాగేష్, దుబ్బాక నవీన్, జయ ఈశ్వర్, బోడ శ్రీరాములు, కటేపాక ప్రవీణ్, గంగాని శ్రీను, బోడ శ్రవణ్, గంగాని ప్రవీణ్‌తో పాటు శ్రీ వెంకటేశ్వర కాలనీ వీకర్ సెక్షన్ మాజీ అధ్యక్షుడు కృష్ణ, బొమ్మడ శీను, రామాచారి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.