BREAKING
thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం
Date of Publish : 02 October 2026, 05:32 pm
Posted by : SEETHA KIRAN KUMAR

దసరా నాటికి భద్రకాళి అమ్మవారి రథం సిద్ధం చేయాలి

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Oct, 2026 - 05:32 PM
3 వీక్షణలు

వరంగల్: దసరా పర్వదినం నాటికి భద్రకాళి అమ్మవారి రథాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రకాళి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

తొలుత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న మాడవీధులు, అమ్మవారి రథం పనులను పరిశీలించారు. దసరా ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

అమ్మవారి రథం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని, కళాకారులు రథానికి తుదిమెరుగులు దిద్దుతున్నారని తెలిపారు. దసరా నాటికి రథాన్ని సిద్ధం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

మాడవీధుల నిర్మాణం పూర్తయితే ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కలగడంతో పాటు దసరా ఉత్సవాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. భక్తుల సౌకర్యం, ఆలయ ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

నిర్మాణ పనుల పురోగతి, మిగిలి ఉన్న పనులు, దసరా ఉత్సవాల నాటికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో KUDA అధికారులు అజిత్ రెడ్డి, భీమ్ రావు, ఆలయ ఈఓ సునీత, స్థానిక నాయకులు బోడ డిన్న, డివిజన్ అధ్యక్షుడు సమద్, మాజీ అధ్యక్షుడు సంగీత, గోల్కొండ సాంబయ్య, క్రాంతి కుమార్, శివ, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.