BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:43 pm
Posted by : K MAHESH

భూ రికార్డుల రీసర్వే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 07:43 PM
16 వీక్షణలు

నమోదైన భూమి విస్తీర్ణంపై అభ్యంతరాలుంటే 60 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు: తహసీల్దార్ నాగరాజు

బయ్యారం, నవంబర్ 13: భూముల రీసర్వే ప్రక్రియలో నమోదైన వివరాలపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని బయ్యారం తహసీల్దార్ చప్పిడి నాగరాజు సూచించారు. తమ భూములకు సంబంధించిన విస్తీర్ణం, సరిహద్దులు, రెవెన్యూ రికార్డుల్లో నమోదైన వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని తెలిపారు.

మండలంలోని గంధంపల్లి రెవెన్యూ గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో భూముల రీసర్వే వివరాలను రైతులకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రీసర్వే ద్వారా గుర్తించిన భూముల విస్తీర్ణాన్ని రైతుల వారీగా చదివి వినిపించి, రికార్డుల్లో నమోదైన వివరాలను తెలియజేశారు. రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించి, ఏవైనా తేడాలు ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు.

రీసర్వేలో నమోదైన భూముల విస్తీర్ణం ఆధారంగా తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం–1923లోని సెక్షన్ 9(2) ప్రకారం సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. నోటీసుల్లో పేర్కొన్న భూ విస్తీర్ణం లేదా ఇతర వివరాలపై రైతులకు అభ్యంతరాలు ఉంటే చట్టప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు.

నోటీసులు అందిన తేదీ నుంచి 60 రోజులలోపు మహబూబాబాద్ డివిజన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేకు ఫారం–13 ద్వారా అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా తమ అభ్యంతరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

రైతులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా రీసర్వేలో నమోదైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని నాగరాజు కోరారు. భూమి విస్తీర్ణం, సరిహద్దులు లేదా ఇతర వివరాల్లో ఏవైనా పొరపాట్లు గుర్తించినట్లయితే చట్టప్రకారం కల్పించిన అప్పీల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ గ్రామసభలో గంధంపల్లి ఉపసర్పంచ్ రావి వీరభద్రరావు, గిర్దావర్లు, సర్వేయర్, గ్రామ పంచాయతీ అధికారులు, జీపీఓలు, రైతులు పాల్గొన్నారు.