BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 04:25 pm
Posted by : V శ్రీనివాస్

2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Oct, 2026 - 04:25 PM
13 వీక్షణలు

మంచిర్యాల: 2030 నాటికి దేశాన్ని టీబీ రహిత భారత్‌గా మార్చే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి కిషన్, ఎన్‌సీసీ కమాండెంట్లతో కలిసి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2030 నాటికి దేశంలో క్షయవ్యాధిని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ను అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు టీబీపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి అనుమానితులను గుర్తించి వైద్య పరీక్షలు చేయించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు టీబీ లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే 15 టీబీ ముక్త్ గ్రామపంచాయతీలను గుర్తించినట్లు పేర్కొన్నారు.

టీబీ బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉందని చంద్రయ్య తెలిపారు. సాయంత్రం వేళల్లో జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాల వివరాలను ముందుగానే ప్రజలకు తెలియజేసి, అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 265 యాక్టివ్ టీబీ కేసులు ఉన్నాయని, రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నట్లు వివరించారు.

టీబీ రోగులకు పోషకాహారం అందించేందుకు నిక్షయ్ పోషణ్ యోజన కింద నెలకు రూ.1,000 చొప్పున చికిత్స పూర్తయ్యే వరకు పోషణ భత్యం అందిస్తున్నట్లు తెలిపారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా టీబీ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహార సహాయం అందించాలని కోరారు. వైద్యుల సూచనల మేరకు మందులను నిర్దేశిత కాలం పాటు క్రమం తప్పకుండా వినియోగిస్తే టీబీని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

టీబీ రోగులను సామాజికంగా దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని సూచించారు. వ్యాధి నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలు, చికిత్స విధానాలపై కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టీబీ రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు సమన్వయంతో పనిచేసి టీబీ నిర్మూలనకు కృషి చేయాలని