BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 29 September 2026, 10:29 pm
Posted by : PAMMI NAVEENKUMAR

రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
29 Sep, 2026 - 10:29 PM
9 వీక్షణలు

రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి: డాక్టర్ పినిపే శ్రీకాంత్

అమలాపురం: అమలాపురం నియోజకవర్గం జనుపల్లి గ్రామంలో పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

పంట పొలాలు నీట మునిగి తీవ్రంగా నష్టపోతున్న రైతులు తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సమస్యకు సంబంధించి ‘‘ఇవన్నీ కాటన్ దొర చేసిన తప్పులు’’ అని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని డాక్టర్ పినిపే శ్రీకాంత్ ప్రశ్నించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

రైతుల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందని డాక్టర్ పినిపే శ్రీకాంత్ అన్నారు. పంటలు నీట మునిగి నష్టపోతున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, నష్టాన్ని అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీను, సూరిబాబు, రైతులు పాల్గొన్నారు.