BREAKING
thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
Date of Publish : 06 October 2026, 04:15 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
06 Oct, 2026 - 04:15 PM
7 వీక్షణలు

ఎమ్మెల్యే సుజనా చౌదరికి వినతిపత్రం అందజేసిన ఆశా వర్కర్లు

విజయవాడ, అక్టోబర్ 6 (ఎన్ టుడే న్యూస్): ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి వినతిపత్రం అందజేశారు. భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు.

ఆశా వర్కర్లను పర్మినెంట్ చేయాలని, వారాంతపు సెలవులతో పాటు క్యాజువల్ లీవ్స్, మెడికల్ లీవ్స్ మంజూరు చేయాలని వారు కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా మార్చాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు అవసరమైన ఇతర సౌకర్యాలను కూడా మెరుగుపరచాలని ఎమ్మెల్యేకు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఈ.వీ. నారాయణ, సుబ్బారెడ్డి, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆశా వర్కర్లు హవీలా కుమారి, కే. అరుణ కుమారి, హలాంబి, ఎ. కుమారి తదితరులు పాల్గొన్నారు.