BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:11 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
20 Nov, 2026 - 07:11 PM
14 వీక్షణలు

నేలటూరి గొల్లపల్లి నాయకులు, కార్యకర్తలకు డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపు

కనిగిరి, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు.

శుక్రవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయంలో కనిగిరి మండలం నేలటూరి గొల్లపల్లి పంచాయతీకి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి ముండ్లపాటి అబ్రహం ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.

దీనికి స్పందించిన పంచాయతీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ముండ్లపాటి అబ్రహంను గెలిపించుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెరికె ఇస్సాకు, పెరికె బెంజిమెన్, ఇంటూరి సౌలు, ఇంటూరి డేవిడ్, ఇంటూరి పౌలు, ఇంటూరి లాజరు, ఇంటూరి జాన్, పెరికె జాన్, ఇంటూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.