BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 06:37 pm
Posted by : K MAHESH

విప్లవ వీరుల త్యాగాలు చిరస్మరణీయం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
10 Nov, 2026 - 06:37 PM
10 వీక్షణలు

అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజా ఉద్యమాలను కొనసాగించాలి: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు

బయ్యారం, నవంబర్ 10 (ఎన్ టుడే న్యూస్):

విప్లవ వీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని వారు కలలుగన్న సమాజ నిర్మాణం కోసం ప్రజా పోరాటాలను కొనసాగించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పిలుపునిచ్చారు. దోపిడీ, పీడన, అణచివేతలు లేని సమాజ స్థాపన కోసం అమరవీరులు చేసిన పోరాటాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బయ్యారం మండలం బాలాజీపేటలో సంస్మరణ బహిరంగ సభ నిర్వహించారు. తొలుత గ్రామంలో ప్రదర్శన చేపట్టారు. అనంతరం అమరుడు కామ్రేడ్ ఎర్రమళ్ల ఎర్రన్న స్మారక స్థూపం వద్ద గ్రామ కమిటీ కార్యదర్శి కొత్త రామదాసు జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత తోకల వెంకన్న అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. సభ ప్రారంభంలో అమరవీరుల స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న, రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా పేదల జీవితాల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని విమర్శించారు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని, సామాన్య ప్రజలు ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

సమాజంలో దోపిడీ, పీడన, అణచివేతలు అంతమై ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించే వ్యవస్థ ఏర్పడాలని నాయకులు ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. చారు మజుందార్, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి తదితర విప్లవ నాయకుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు సాగించిన పోరాటాల స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు.

అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కేవలం నివాళులకే పరిమితం కాకుండా, వారి ఆశయాలు, పోరాట చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికలుగా నిలవాలని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మోకాళ్ల మురళీకృష్ణ, నందగిరి వెంకటేశ్వర్లు, చింత వెంకన్న, ఎం. యాకన్న, గుడిబోయిన రమేష్, నేతగాని రాకేష్, మాదారపు నాగరాజు, ఎస్.కె. మహమూద్, అరుణోదయ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.