కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం
NTODAY NEWS : చిట్యాల
తెలంగాణ జాతిపిత, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, స్థానికులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిన్న మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ నర్ర వినోద్ మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గుజ్జరి యాదగిరి, కోశాధికారి గంజి శ్రీను తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు, ఆయన చూపిన పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని కొనియాడారు. బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో వార్డు సభ్యులు జెల్ల ప్రశాంత్, తేల్సూరి నరసింహ, ఏర్పుల కుర్రు యాదయ్య, నీలకంఠం లింగస్వామి, చేకూరి గణేష్, సాగర్ల నాగరాజు, ఏర్పుల వెంకన్న, జెల్ల పురుషోత్తం, జెల్ల నరసింహ, గంజి భాస్కర్, పున్న వెంకటేశం, జెల్ల రామలింగం, జెల్ల తిరుమలయ్య, ఏర్పుల రాకేష్, నందిపాటి కృష్ణ, మోర స్వామి, చేకూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.