BREAKING
thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి
Date of Publish : 11 October 2026, 06:35 pm
Posted by : KOLA MAHESH

మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
11 Oct, 2026 - 06:35 PM
3 వీక్షణలు

మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

డిండి ఎత్తిపోతల పథకంపై విశ్రాంత ఇంజనీర్లతో సమీక్ష

మునుగోడు, అక్టోబర్ 11: ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మునుగోడు నియోజకవర్గ ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. డిండి ఎత్తిపోతల పథకం, లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీటి తరలింపు అంశాలపై తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల ప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి, దాని పరిధిలోని లక్ష్మణాపురం, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీటిని తరలించే అంశాలపై చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులకు నీటి తరలింపు మార్గంపై తగిన నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించిందని, ఇందుకు సంబంధించిన పనుల కోసం రూ.1,800 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నీటి తరలింపునకు సంబంధించి భూసేకరణ, హెడ్‌వర్క్స్‌తో పాటు ఇతర పనులను పూర్తి చేసేలా ప్రభుత్వంతో మాట్లాడతానని విశ్రాంత ఇంజనీర్ల ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలే ప్రధాన ప్రాధాన్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం, సలహాదారులు వి. వెంకటరామారావు, ఎం. సత్తిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.