BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 12:10 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వచ్చే ఆగస్టు వరకు వరంగల్‌లో నీటి ఇబ్బందులు ఉండవు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
13 Nov, 2026 - 12:10 PM
24 వీక్షణలు

నీటిని పొదుపుగా వినియోగిస్తే సరిపడా తాగునీరు.. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.23 టీఎంసీల నిల్వ

వరంగల్: ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగిస్తే వచ్చే ఏడాది ఆగస్టు వరకు తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఎస్ఈ రాజ్‌కుమార్ తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.23 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఇది సుమారు 189 రోజుల అవసరాలకు సరిపోతుందని వెల్లడించారు.

ధర్మసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 1.23 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించారు. అదనంగా దేవాదుల పథకం ద్వారా మార్చి నెల వరకు నీటిని పంపింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. దీంతో నగర తాగునీటి అవసరాలకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఒప్పందం ప్రకారం ఎల్‌ఎండీ నుంచి 50 శాతం నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. అలాగే భద్రకాళి చెరువులోని నీటిని కూడా అవసరమైన సమయంలో వినియోగించుకుంటామని వెల్లడించారు.

గ్రేటర్ వరంగల్ పరిధిలో సుమారు 1.65 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయని పేర్కొన్న ఎస్ఈ, ప్రతి ఒక్కరూ నీటిని బాధ్యతగా వినియోగించాలని సూచించారు. అవసరానికి మించి నీటిని వృథా చేయకుండా పొదుపు పాటిస్తే అందరికీ నిరంతర నీటి సరఫరా అందించేందుకు వీలుంటుందని తెలిపారు.