BREAKING
thumb ● కీటకజనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● కీటకజనిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు
Date of Publish : 26 September 2026, 07:30 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చుక్కల దుప్పిని వేటాడిన ముగ్గురి అరెస్ట్‌ – 14 రోజుల రిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Sep, 2026 - 07:30 AM
4 వీక్షణలు

మార్కాపురం జిల్లా గిద్దలూరు డివిజన్‌ పరిధిలోని గుండ్లకమ్మ రేంజ్‌, రాచెర్ల సెక్షన్‌, అంబవరం బీట్‌లోని ENB-I రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చుక్కల దుప్పిని ఉచ్చులు బిగించి వేటాడిన కేసులో ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు.

అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గోగుల శ్రీను, భూపాని శ్రీ వెంకట లక్ష్మీ నారాయణ, గుర్రం పెద్ద గురవయ్యలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను గిద్దలూరు మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో వారిని ప్రకాశం జిల్లా ఒంగోలు డిస్ట్రిక్ట్‌ జైలుకు తరలించారు.

చుక్కల దుప్పి వన్యప్రాణుల రక్షణ చట్టం పరిధిలో రక్షిత వన్యప్రాణిగా ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. చుక్కల దుప్పిని వేటాడటం, హతమార్చడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో అక్రమంగా వేటకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.