BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 08 October 2026, 04:29 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కరీంనగర్ జిల్లాలో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
08 Oct, 2026 - 04:29 PM
4 వీక్షణలు

కరీంనగర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సీఐ బొల్లం రమేష్, ఎస్ఐ అన్వర్, కానిస్టేబుల్ అజీజోద్దిన్‌లను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

గతంలో ఎల్ఎండీ సీఐగా పనిచేసిన బొల్లం రమేష్‌పై అక్రమంగా మట్టి తరలిస్తున్న వ్యక్తుల నుంచి రూ.50 వేల నగదు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐతో పాటు ఎస్ఐ అన్వర్, కానిస్టేబుల్ అజీజోద్దిన్‌పై విచారణ చేపట్టినట్లు తెలిసింది.

విచారణలో భాగంగా ముగ్గురు పోలీసులను నిన్న ఏఆర్‌కు అటాచ్ చేస్తూ బదిలీ చేసినట్లు సమాచారం. అనంతరం చేపట్టిన విచారణకు సంబంధించిన నివేదిక పోలీసు ఉన్నతాధికారులకు అందినట్లు తెలిసింది.

విచారణ నివేదికలోని అంశాలను పరిశీలించిన అనంతరం ముగ్గురిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సీఐ బొల్లం రమేష్, ఎస్ఐ అన్వర్, కానిస్టేబుల్ అజీజోద్దిన్‌లకు సంబంధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను పోలీసు ఉన్నతాధికారులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో విచారణ నివేదికలోని పూర్తి వివరాలు, ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.