BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 17 November 2026, 09:26 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం అడవుల్లో పెద్దపులి సంచారం.. అప్రమత్తమైన అటవీ, పోలీస్ శాఖలు!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 09:26 AM
5 వీక్షణలు

చింతంపల్లి నుంచి పోలవరం అటవీ ప్రాంతానికి చేరిన పులి

ప్రతి రెండు గంటలకోసారి జీపీఎస్‌తో కదలికలపై నిఘా.. పులి జాడ కోసం అధికారుల నిరంతర పర్యవేక్షణ

**ఏలూరు జిల్లా:** అడవుల్లో పెద్దపులి అడుగులు పడటంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పులి కదులుతున్న నేపథ్యంలో దాని జాడను గుర్తించేందుకు అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. చింతలపూడి మండలం చింతంపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి చాట్రాయి మండలం పోలవరం అటవీ ప్రాంతంలోకి చేరినట్లు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా అధికారులు గుర్తించారు. దీంతో పోలవరం పరిసర అటవీ ప్రాంతాల్లో పులి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు.

గత రాత్రి నుంచి పులి సంచారాన్ని అటవీ శాఖతో పాటు పోలీస్ శాఖ అధికారులు కూడా నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. పులికి అమర్చిన జీపీఎస్ పరికరం ద్వారా అది ఏ ప్రాంతంలో ఉంది, ఏ దిశగా కదులుతోంది అనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి జీపీఎస్ సమాచారాన్ని పరిశీలిస్తూ పులి కదలికలను నమోదు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

పులి సంచారం నేపథ్యంలో అటవీ ప్రాంతాలకు సమీపంలోని పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పులి అడుగులు ఎటువైపు పడుతున్నాయి, దాని సంచారం ఏ ప్రాంతం వైపు కొనసాగుతోంది అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జీపీఎస్ ద్వారా అందుతున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.


ఈ విషయాలను మంగళవారం పోలవరంలో ఫారెస్ట్ డీఆర్వో డి. హనుమంతు వెల్లడించారు. పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నామని, జీపీఎస్ ఆధారంగా దాని సంచారాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు.


ఇదిలా ఉండగా, పెద్దపులి సంచారం గురించి తెలిసిన స్థానికులు అప్రమత్తంగా ఉంటున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు పొలాలకు, అడవుల వైపు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఒంటరిగా అడవుల్లోకి వెళ్లకూడదని, పులి కనిపించినా దాని దగ్గరకు వెళ్లడం, వెంటపడటం, ఫొటోలు లేదా వీడియోలు తీసేందుకు ప్రయత్నించడం చేయకూడదు. పులి కదలికలపై ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలి.

చింతలపూడి నుంచి చాట్రాయి మండలం పోలవరం వరకు పులి సంచారం అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుండటంతో పరిసర ప్రాంతాల్లో ఆసక్తితో పాటు అప్రమత్తత నెలకొంది. పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు అందించే సూచనలను ప్రజలు పాటించాలని సూచిస్తున్నారు.