BREAKING
thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం
Date of Publish : 08 October 2026, 12:10 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సకాలంలో స్పందన.. రూ.80 లక్షల సైబర్ మోసం నివారణ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
08 Oct, 2026 - 12:10 PM
5 వీక్షణలు

మల్కాజిగిరి: బ్యాంకు నుంచి అందిన అప్రమత్తత సమాచారంతో మల్కాజిగిరి పోలీసులుసకాలంలో స్పందించి డిజిటల్ అరెస్ట్, సెక్స్‌టార్షన్ తరహా సైబర్ మోసానికి గురైన ఓ సీనియర్ సిటిజన్‌కు కౌన్సెలింగ్ అందించారు. పోలీసుల తక్షణ జోక్యంతో మరింత నగదు బదిలీ కాకుండా అడ్డుకోవడంతో సుమారు రూ.80 లక్షల వరకు సంభవించే నష్టాన్ని నివారించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులమని చెప్పుకుంటూ వీడియో కాల్స్ చేయడం, బెదిరింపులకు పాల్పడటం లేదా అత్యవసర పరిస్థితి పేరుతో డబ్బులు డిమాండ్ చేయడం వంటి ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలాంటి కాల్స్, మెసేజ్‌లు వచ్చినప్పుడు భయపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.

సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా ఆర్థిక నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.